టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్స్ ని  ఎప్పుడు భిన్నంగానే చూడాలి వారు ఏ పని చేసినా కూడా అది భిన్నంగానే ఉంటుంది మాట్లాడే తీరు వ్యవహరించే పద్ధతి తీసే సినిమాలు మిగతా వారితో పోలిస్తే కొంత విభిన్నంగా ఉంటాయి.

కొన్నిసార్లు వారు ఏం మాట్లాడినా వినాలి అనిపిస్తుంది మరికొన్నిసార్లు ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అలాంటి వారిలో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ వ్యక్తులుగా రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, తేజ లాంటి వారి పేర్లు చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నలుగురు దర్శకులను మిగతా వారితో పోలిస్తే చాలా తేడా కాకుండా అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు కూడా ఫామ్ లో లేరు. పైగా దీంట్లో రాంగోపాల్ వర్మకి కృష్ణవంశీ తేజ పూరి జగన్నాథ్ ముగ్గురు కూడా శిష్యులు. అతడు సినిమాలకు వీరంతా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నలుగురు దర్శకులకి కాస్త తిక్క ఉంది కానీ వీరికి కుటుంబం అనే ఒక కామన్ పాయింట్ కూడా ఉంది.

అందుకే అనుకుంటా అందరూ వర్మ లాగానే వ్యవహరిస్తూ ఉంటారు వాస్తవానికి మన నిత్యజీవితంలో ఉండే చాలా విషయాలను వీరు అసలు పట్టించుకోరు.భార్య, బంధుత్వాలు అంటే వారికి లెక్క ఉండదు. తీసే సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో వర్మ విషయం కాసేపు పక్కన పెడితే కృష్ణవంశీ, తేజ, మరియు పూరీ జగన్నాథ్ కూడా అవతల వారిని తికమక చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ నలుగురికి వీరి గురువులు వీరిని మించిన వారు మరొకరు లేరు వీరందరూ కం బ్యాక్ ఇస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులంతా కూడా కోరుకుంటున్నారు. డబ్బులు పెట్టడానికి చాలామంది నిర్మాతలు ఉన్న వీరికి నచ్చకపోతే సినిమా తీయరు. ఇక వర్మతో పోలిస్తే కృష్ణవంశీ, తేజ మరియు పూరి జగన్నాథ్ కొత్త క్లారిటీతో ఉన్నారని చెప్పుకోవచ్చు. కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా ఉన్నా కూడా అతడికి ఫ్యామిలీ అనే విషయానికి కాస్త దూరంగా ఉన్నాడు. కేవలం అతడితో కృష్ణవంశీ తల్లి మాత్రమే జీవిస్తుంది. ఇక తేజ కూడా బయటకి చాలా గంభీరంగా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొడుతూ మాట్లాడుతాడు. కానీ కుటుంబం అనే విషయం వచ్చేసరికి తేజ చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. తన కొడుకు కోసం నాలుగేళ్ల పాటు నరకం అనుభవించాడు. ఇక పూరి జగన్నాథ్ కూడా అంతే తన భార్య మెడలో తాళి తప్ప అన్ని అమ్మేసి తిరిగి అంత కన్నా రెట్టింపు డబ్బు సంపాదించి భార్య చేతిలో పెట్టాడు. ఇలా వీరు మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు తేడా ఉన్నప్పటికీ వీరంతా కూడా తెలుగులో ఎంతో మంచి పేరు ఉన్న దర్శకులు.

ఎంతైనా వీళ్ళు వర్మ శిష్యులు కాదా అని నేటిజన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: