టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి అలా సూపర్ హిట్ అయినా సినిమాల క్రేజ్ ని వాడుకుంటూ వాటికీ సీక్వల్స్ గా కొన్ని సినిమాలని ప్లాన్ చేస్తారు దర్శక నిర్మాతలు.

అయితే తెలుగు లో వచ్చి సూపర్ హిట్ అయినా సినిమాలకి సీక్వల్ గా వచ్చి ప్లాప్ అయినా సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.ఈ లిస్ట్ లో మొదట గా చెప్పుకునే సినిమా ఆర్య 2. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది ఇంతకు ముందు వచ్చిన ఆర్య సినిమా సూపర్ హిట్ అవడం తో అదే క్రేజ్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది...అయితే అల్లు అర్జున్సినిమా కోసం చాలా కష్టపడ్డప్పటికీ ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కలేదనే చెప్పాలి.

ఇక తరువాత చెప్పుకునే సినిమా కిక్ 2. రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా వచ్చిన కిక్ సినిమా సూపర్ హిట్ అయింది సురేందర్ రెడ్డి డైరెక్షన్ కూడా ఈ సినిమా కి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి.అయితే ఈ సినిమా కి సీక్వల్ గా వచ్చిన కిక్ 2 సినిమా మాత్రం డిజాస్టర్ అయింది...ఇక తరువాత చెపుకోబోయే సినిమా మన్మధుడు 2.నాగార్జున హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్ గా చేసిన సినిమా మన్మధుడు ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ మాటలు అందించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో చాలా సంవత్సరాల తరువాత నటుడు రాహుల్ డైరెక్షన్ లో నాగార్జున హీరో గా మన్మధుడు 2 సినిమా వచ్చింది.ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా డిజాస్టర్ అయింది.ఇలా ఇండస్ట్రీ లో సీక్వల్స్ గా వచ్చి డిజాస్టర్స్ అయి ముందు సూపర్ హిట్ అయినా సినిమాల పేర్లు చెడగొట్టిన సినిమాలు ఇవే అని చెప్పాలి.

ఈ దెబ్బతో దర్శక నిర్మాతలకి సీక్వెల్ సినిమాలు చేయాలంటే వణుకు పుడుతుంది అని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: