అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  అఖిల్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేనునట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

 ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రకటించడంతో ప్రస్తుతం ఈ మూవీ నుండి వరుస పాటలను మరియు ప్రచార చిత్రాలను ఈ చిత్ర బృందం విడుదల చేస్తూ వస్తుంది. ఇలా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్  ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ ఈ మూవీ పై అంచనాలు పెంచేస్తుంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ విడుదల మరి కొన్ని రోజులు లేట్ కానున్నట్లు ... ఈ సినిమా బెటర్ అవుట్ పుట్ కోసం సురేందర్ రెడ్డి మరో రెండు నెలల సమయాన్ని అడుగుతున్నట్లు ... దానితో ఈ మూవీ విడుదల మరి కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదలకు సంబంధించి వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ... ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదినే విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: