
గతంలో ఎక్కువగా రాయలసీమ ఫ్యాక్షనిజం తదితర చిత్రాలు అన్నీ కూడా విడుదలైన ప్రతిచోట కూడా బాగానే ఆకట్టుకున్నాయి.. ఈ మధ్యకాలంలో కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యం సినిమా కావడంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరాధం పట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. ముఖ్యంగా తెలంగాణ నేటివిటీ అక్కడి ప్రజలు భాష అన్నీ కూడా ఎంతో చక్కగా చూపించారు కమిడియన్ వేణు.
ఇక ఈ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా తెలంగాణ యాస నేపథ్యంలో తెరకెక్కించారు. అందువల్లే పెద్దగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తక్కువగా పనితీరును కనబరుస్తున్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అందుకు గల కారణం పూర్తిగా అక్కడి ప్రాంతీయ నేపథ్యంలోని తెరకెక్కించడమే అన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో నుంచి రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లు విడుదలైన సినిమాలు అందరిని బాగా ఆకట్టుకుంటూనే ఉంటాయి. కేవలం తెలంగాణ నేపథ్యంలో ఉండే సినిమాలే ఆంధ్రాలో సక్సెస్ రేట్ తక్కువ ఉన్నట్లు సమాచారం.