
అలానే డైరెక్టర్స్ కి ప్రభాస్ టార్గెట్ ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కె ఆల్రెడీ 2024 సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఆ సినిమా అక్టోబర్ కల్లా పూర్తి చేస్తారని చెప్పొచ్చు. మారుతి సినిమా కూడా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరి మారుతి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా తెలియలేదు. 2024 సమ్మర్ కి మారుతి ప్రభాస్ సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ కల్లా కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసి సందీప్ వంగ స్పిరిట్ కోసం నెక్స్ట్ ఇయర్ కేటాయించాలని చూస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్న సందీప్ వంగ ప్రభాస్ తో చేస్తున్న సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ప్రభాస్ తర్వాత సందీప్ వంగ అల్లు అర్జున్ తో సినిమా లైన్ లో పెట్టుకున్నాడు. ప్రభాస్ సినిమాతో సందీప్ వంగ పాన్ వరల్డ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. ప్రభాస్ తో స్పిరిట్ టైటిల్ తోనే షాక్ ఇచ్చిన సందీప్ ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.