సీనియర్ నటీనటులైన నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి.. ఈ చిత్రం వీరిద్దరి నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా డైరెక్టర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పైన నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది.. ఈనెల 26వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాకు సొంతం చేసుకుంది అయితే విడుదలకు ముందు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ గట్టి ప్రమోషన్స్ నిర్వహించిన కలెక్షన్లు పెద్దగా రావట లేకపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా మొదటి రోజు కేవలం రూ .44 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు థియేటర్లో వచ్చే రెస్పాన్స్ని బట్టి ఈ సినిమా ఓటీటి లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలుగుతో పాటు కన్నడాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో వనిత విజయ్ కుమార్ కూడా నటించడం జరిగింది.


ఈమె క్రేజను క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావించి కన్నడలో కూడా ఈ సినిమాని భారీగా విడుదల చేశారు. అలాగే ఇటీవల మరణించిన శరత్ బాబు కృష్ణ పాత్రలో నటించగా అన్నపూర్ణ భద్రం తదితరులు సైతం నటించారు ఇక ఈ సినిమా మొత్తం నరేష్ పవిత్ర వనిత విజయ్ కుమార్ల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చి విఫలమైన ఈ సినిమా మరి ఓటిటిలో నైనా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: