ప్రముఖ బుల్లితెర నటీమణులలో ఒకరైన దీపికా కక్కర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ టీవీ సీరియళ్ల ద్వారా ఆమె ఊహించని స్థాయి లో పాపులారిటీని పెంచుకున్నారు.ఊహించని స్థాయ లో క్రేజ్ కలిగి ఉన్న ఈ నటి పెళ్లైన ఐదు సంవత్సరాల తర్వాత గర్భవతి కావడంతో యాక్టింగ్ కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నటనకు తాను గుడ్ బై చెబుతున్నానని ఈ నటి షాకింగ్ ప్రకటన చేశారు.

యాక్టింగ్ కు దీపికా కక్కర్ గుడ్ బై చెప్పడం గురించి ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. తల్లి కాబోతున్నాననే భావన ఎంతో బాగుందని దీపికా కక్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లైన ఐదు సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో ఆ ఉత్సాహం వేరే లెవెల్ లో ఉందని దీపికా కక్కర్ చెప్పుకొచ్చారు.తక్కువ వయస్సులోనే నేను కెమెరా ముందుకు వచ్చి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టానని దీపిక అన్నారు. దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఈ ఇండస్ట్రీ లో కెరీర్ ను కొనసాగించానని ఆమె కామెంట్లు చేశారు. నా ప్రెగ్నెన్సీ ప్రయాణం మొదలైన వెంటనే నాకు పని చేయడం ఏ మాత్రం ఇష్టం లేదని షోయబ్ కు చెప్పేశానని దీపికా కక్కర్ అన్నారు. ఇకపై గృహిణిగా తల్లిగా కెరీర్ ను కొనసాగించాలని ఫిక్స్ అయ్యానని ఆమె తెలిపారు.

దీపికా కక్కర్ చేసిన కామెంట్లు ఒకవైపు సంతోషాన్ని మరోవైపు బాధను కలిగిస్తున్నాయని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దీపికా కక్కర్ కు భాష తో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మరికొన్ని సంవత్సరాల తర్వాత దీపికా కక్కర్ రీఎంట్రీ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేసున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: