టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాల సైఫ్ విలన్ గా నటించడం ప్రాజెక్ట్ మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో నటించిన సైఫ్ అలీ ఖాన్ మొదటిసారి తెలుగు సినిమా చేస్తున్నారు.

కాగా ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సైఫ్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. రావణాసురుడి పాత్ర పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆదిపురుష్ లో రావణాసురుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీలో నటిస్తున్నాడు. దీంతో ఆదిపురుష్ ఎఫెక్ట్ దేవర మీద ఉంటుందా అన్న డౌట్ మొదలైంది. ఆదిపురుష్ సినిమాలో నటన పరంగా సైఫ్ ఓకే అనిపించినప్పటికీ అతన్ని ప్రొజెక్ట్ చేసిన విధానంలో డైరెక్టర్ ఓం రౌత్ ఫెయిల్ అయ్యాడు. సైఫ్ ని సరిగా వాడుకోలేదు దర్శకుడు. ఇక దేవర సినిమా విషయానికి వస్తే సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. అయితే దేవరలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి తగ్గట్టుగా విలన్ పాత్రని కూడా డిజైన్ చేశారట కొరటాల శివ. ఆదిపురుష్ లో సైఫ్ నటనకు దేవరలో సైఫ్ కి పూర్తిగా మార్పు ఉంటుందని. అతన్ని కొత్త యాంగిల్ లో చూపించబోతున్నారని సమాచారం. దేవరలో విలన్ గా సైఫ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారట. అయితే ఎంత చేసినా సరే ఆదిపురుష్ ఎఫెక్ట్ దేవర మీద ఉంటుందా అన్న డౌట్ అయితే ఉంది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో గుబులు మొదలైంది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: