అయితే పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడంతో తమ కొణిదెల కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందంటూ చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు.. అంతేకాదు పాప రాకతో తమ కుటుంబానికి అన్ని కలసి వస్తున్నాయని కూడా చిరు చెప్పారు .ఇదే సమయంలో కొందరు జ్యోతిష్యులతో పాటు మెగా అభిమానులు కూడా రామ్ చరణ్ జాతకం మారబోతుందని అంటున్నారు. పాప కడుపులో పడ్డప్పటి నుంచి అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నారు. చరణ్ మాదిరిగానే తొలి సంతానంగా కుమార్తెకు జన్మనిచ్చిన స్టార్స్ కొందరు ఆ తర్వాత తమ కెరీర్ లో మరింత ఉన్నతంగా ఎదిగారు . చిరంజీవికి మొదటి సంతానంగా సుస్మిత జన్మించింది. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ గా మారిపోయారు. బాలకృష్ణకు బ్రాహ్మణి మొదటి సంతానం. అప్పట్లో బాలయ్య వరుస విజయాలు అందుకున్నారు .. వెంకటేష్ కు ఆశ్రిత, మోహన్ బాబుకు లక్ష్మీ ప్రసన్న పుట్టిన తర్వాత కలసి వచ్చింది , అమితాబ్ బచ్చన్ కు శ్వేత బచ్చన్.. రజినీ కాంత్ కు ఐశ్యర్య పుట్టాక వారు ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు , అలాగే కమల్ హాసన్ కు శృతి హాసన్, సైఫ్ అలీ ఖాన్, రణ్బీర్ కపూర్ వంటి వారికీ స్టార్లందరికీ మొదటి సంతానంగా ఆడపిల్లలే పుట్టారు. ఆడపిల్ల రాకతో వీళ్లు స్టార్లుగా మారిపోయారు. దీనితో చరణ్ కూడా మరింత ఎదుగుతారని అంటున్నారు. ఇప్పటికే ఆ పరిణామాలు కనిపిస్తున్నాయని .. చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడని .. మరింత ఎదగడం ఖాయమని పేర్కొంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు తండ్రిగా ఒక పెద్ద బాధ్యత మోయాబోతున్నాడు ఇక ఈ విషయం మీద చిరంజీవి రామ్ చరణ్ కి చాలా సలహాలు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటంటే పిల్లల్ని తండ్రి గా ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పెంచాలి, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేయాలి అనే విషయం మీద చిరంజీవి, రామ్ చరణ్ కి వివరించి చెప్పినట్లుగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి