హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో రన్వీర్ సింగ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి హిందీ లో ప్రస్తుతం టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రన్బీర్ ఇప్పటికే తను నటించిన హిందీ సినిమాలతో ఇండియా వ్యాప్తంగా కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు రాకి రాణి కా ప్రేమ్ కహాని అనే ప్రేమ కథ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అలియా భట్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితమే హిందీ లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను అందుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను సాధించిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ హిందీ భాషలో అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరి ఈ సినిమాకు "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇకపోతే ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారి ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: