మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని దిల్ రాజు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఆర్టిస్టుల డేట్స్ లేక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాము అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే లేటెస్ట్ జి ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కి మైనర్ ఇంజ్యురీస్ అయ్యాయని సమాచారం. రెండు రోజుల క్రితం చరణ్ కి చిన్న ఇంజ్యురీ అయ్యింది, దీంతో చరణ్ కి డాక్టర్స్ పది రోజుల పాటు రెస్ట్ తీసుకో మని సజెస్ట్ చేసారు. ఈ కారణంగానే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆగింది.

పది రోజుల తర్వాత అక్టోబర్ 6 నుంచి హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ జరుగ నుంది. అన్బారీవ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వం లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయ నున్నారు. ఈ హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయాలి అంటే చరణ్ ఫిట్ గా ఉండాలి లేదంటే షూట్ స్టార్ట్ అయిన తర్వాత మధ్య లో ఆగాల్సి వస్తుంది. సినిమాకే హైలైట్ గా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి మధ్య లో బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేకనే చరణ్ పది రోజుల రెస్ట్ తర్వాత ఒకేసారి షూటింగ్ చేయడా నికి రెడీ అవుతున్నాడు. చరణ్ కి గాయాలు అయ్యాయి అనే మాటని బయట కి రాకుండా మూడు నాలుగు రోజులు గా సీక్రెట్ గా ఉంచారు. ఈ విషయం బయట కి రావడం తో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: