ప్రజెంట్ దేశమంతా బాగా మార్మోగి పోతున్న పేరు అనిరుధ్. అతి పిన్న వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సంగీత దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి జైలర్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీస్ ద్వారా అనిరుధ్ తన మ్యూజిక్ తో జనాలను మ్యాజిక్ చేశాడు. ఆయన తరువాత చిత్రం లియో. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్  ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇంకా దాంతో పాటు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ చిన్న వయసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు.  లియో సినిమా లిరికల్ సాంగ్స్ రెండు విడుదల అయ్యాయి.అందులో నా రెడీ అనే పాట సో సో గా రెస్పాన్స్ అందుకోగా తాజాగా విడుదలయిన బ్యాడాస్ పాట మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.


పైగా ఈ పాటని కాపీ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనిరుధ్ కాపీ కొట్టారంటూ బాగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. అనిరుధ్ గతంలో బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలిరేకులు తెలుగు సీరియల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టారని ఆధారాలతో సహా చూపిస్తూ నెటిజన్స్ తెగ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు తమన్ మాత్రమే కాపీ క్యాట్ అని అనుకున్నం..ఆయన జంటకు నువ్వు చేరావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోకు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్.. మక్కీకి మక్కి మొగలిరేకులు సీరియల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు వెహికల్ లో వెళ్తున్న టైంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంది. ఈ సీరియల్ నుంచి అనిరుధ్ దానిని కాపీ కొట్టారంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.కాపీ కొడితే కొట్టాడు కానీ ఈ సాంగ్ మాత్రం వినడానికి కూడా అసలు బాగోలేదు. అలాగే ఆడియో ఈవెంట్ కూడా జరపట్లేదు కాబట్టి ఈ సినిమాపై రాను రాను లో బజ్ ఏర్పడుతుంది. ఫలితం తేడాగా ఉంటుందేమో అని విజయ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: