సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావిడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఒక్క సంక్రాంతికి ఊహించని స్థాయిలో సినిమా బిజినెస్  జరుగుతూ ఉంటుంది.ఇక 2024 సంక్రాంతి పండగను కూడా చాలామంది టార్గెట్ చేశారు. ముందుగానే మహేష్ బాబు గుంటూరు కారం రవితేజ, ఈగల్ ఇంకా తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.ఇక విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా అప్పుడే థియేటర్ లలో రాబోతోంది. అలాగే రీసెంట్ గా తమిళ్ డబ్బింగ్ సినిమాలు అయలన్ ఇంకా అరన్మనయ్ 4 కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసాయి. వీటిలో  ఏవి కూడా వెనక్కి తగ్గే అవకాశం  లేదు.ఎప్పుడైతే ప్రభాస్ ప్రాజెక్ట్ K వాయిదా పడుతోంది అని తెలిసిందో అప్పుడే వీళ్ళందరూ కూడా సంక్రాంతికి గట్టిగా ఫిక్స్ అయిపోయారు.అయితే మధ్యలో కొన్ని సినిమాలు వాయిదా పడుతున్నట్లు గాసిప్స్ వచ్చినా కూడా మళ్లీ వెంటనే క్లారిటీ ఇస్తున్నారు.


ఇక ఇప్పుడు జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ఫామ్ లోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ సంక్రాంతికి హడావిడి చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఆయన సినిమాలో పూర్తిగా నటించకపోయినా కూడా మంచి నిడివి ఉన్న పాత్ర మాత్రం చేశారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు  చిత్ర యూనిట్ ప్రకటించేసింది. ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోగా విష్ణు విశాల్ నటిస్తున్నాడు. ఒక పవర్ఫుల్ పాత్రలో మంచి టైమింగ్ ఉన్న పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించబోతున్నారు. మరి పొంగల్ రేసులో సూపర్ స్టార్ మహేష్ పోటీగా వున్నాడు. మరి సూపర్ స్టార్ మహేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ వీరిద్దరిలో ఎవరు నెగ్గుతారో చూడాలి.సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఊర మాస్ అవతారంలో ఫ్యాన్స్ ని మెప్పించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: