టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ ... తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న ఫ్యామిలీ స్టాక్ సినిమాలకు సంబంధించిన షూటింగ్ వివరాలను తెలుసుకుందాం.

డబల్ ఈస్మార్ట్ : రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాలో ఏజెంట్ ... గాండీవ దారి అర్జున సినిమాలలో హీరోయిన్ గా నటించిన కావ్య తప్పర్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇక పోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ముంబై లో రామ్ పోతినేని మరియు కావ్య తప్పర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ మూవీ లోనే హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ స్టార్ : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పరుశురామ్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు . ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు న్యూ ఢిల్లీ లో విజయ్ దేవరకొండ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . ఇక పోతే ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ ... పరుశురామ్ కాంబోలో రూపొందిన గీత గోవిందం మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: