ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కాదు అటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే తనకు ఇప్పటికే రెండు సినిమాలతో సూపర్ హిట్ లు ఇచ్చిన కొరటాల శివ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నాడు తారక్. ఇక ఈ మూవీలో అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తుంది.


 కాగా జాన్వి కపూర్, తారక్ జోడి ఎలా ఉంటుందో అని చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారో అని చెప్పాలి. అయితే ఈ మూవీలో ప్రేక్షకుల ఊహకందని రీతిలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని గత కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. దీంతో ఈ మూవీ పై ఉన్న అంచనాలు  రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి అని చెప్పాలి. అయితే దేవర మూవీకి సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ క్రిస్మస్ పండుగకి తారక్ అభిమానులందరికీ కూడా ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తోంది.


 ఏకంగా దేవర సినిమాకు సంబంధించిన టీజర్ క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారట. ఇక దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్  విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అని  ప్రేక్షకులు ఇప్పటినుంచి ఊహాగానాల్లోకి వెళ్లిపోతున్నారు. అయితే యంగ్ సెన్సేషన్ అనిరుద్ ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉండడం గమనార్హం. వచ్చే ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: