హనుమాన్ సినిమా ఇండియా లో భారీగానే కలెక్షన్స్ రాబట్టింది మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు హిందీలో దాదాపుగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. కన్నడ తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా బాగానే రెస్పాన్స్ అందుకుంది ఇక రెండోవారం ఈ సినిమా రూ .59 కోట్ల రూపాయలను కలెక్షన్స్ రాబట్టింది. రెండోవారానికి రూ .160 కోట్లు ఇండియాలో రాబట్టింది. ఇక మూడవ వారంలో మొత్తం మీద రూ .150 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
ఇక హనుమాన్ సినిమా 21 వ రోజున కలెక్షన్స్ విషయానికి వస్తే ఇండియాలో కోటి రూపాయలు రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా రూ .2.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా రూ .300 కోట్ల రూపాయల టార్గెట్ ని చేరువయే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.275 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రూ.140 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ తో హనుమాన్ సినిమా ముందుకు వెళ్తోంది. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బిజినెస్ పరంగా రూ.28 కోట్ల రూపాయలు జరగకగా ఇప్పటికే ఈ సినిమా రూ.110 కోట్లకు పైగా లాభాలను రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉన్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి