తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్ర లలో నటించి ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులలో మాస్ మహారాజా రవితేజ ఒకరు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో కొన్ని సినిమాలు అద్భుతమై న విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి . అలా రవితేజ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో క్రాక్ మూవీ ఒకటి.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు . వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ.లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల లో నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాతో రవి తేజ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో మరింత గా పెరిగింది . అలాగే ఈ సినిమా లోని రవితేజ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఇంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తే బాగుంటుంది అని రవితేజ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజసినిమా సీక్వెల్ పై పని చేసే విధంగా గోపీచంద్ మలినేని కి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే గోపీచంద్ మరిన్కొన్ని రోజుల్లో సన్నీ డియోల్ హీరో గా ఓ మూవీ ని రూపొందించబోతున్నాడు. ఆ సినిమా తర్వాత క్రాక్ సీక్వెల్ పై గోపీచంద్ మలినేని పని చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: