తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం మెగా కోడలిగా వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.అయితే పెళ్లి తర్వాత కూడా ఆ సినిమాల విషయంలో తగ్గేదే లేదు అంటుంది లావణ్య. ప్రస్తుతం ఈమె ఒక తమిళ సినిమాలో నటించనుంది. ఈ ఒక్క ప్రాజెక్టు తప్పితే ఈ ముద్దుగుమ్మ చేతిలో మరే సినిమాలు లేవు. సినిమాలలో నటించకపోయినప్పటికీ వరుస గ్లామర్ ఫోటోషూట్స్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది లావణ్య. ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.

ఆ పోస్టులో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. నాకు అమ్మ చెవి దిద్దులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇకపై అవి నావే అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. వాటిని ధరించి చీరలో కొన్ని ఫొటోలకు పోజు లిచ్చింది.ప్రస్తుతం ఇవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టు వైరల్ అవ్వడం తో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  కాగా మొదటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తో భారీ గా పాపులారిటీ ని ఏర్పరచుకున్న లావణ్య ఆ తర్వాత తెలుగు లో పలు సినిమా లలో నటించి మెప్పించింది. తెలుగు లో రామ్ పోతినేని, వరుణ్ తేజ్,కార్తికేయ, ఇలాంటి హీరో ల సరసన నటించి మెప్పించింది. అయితే పెళ్లి అయిన కూడా సినిమా లలో నటిస్తాను. మంచి మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పు కొచ్చింది లావణ్య త్రిపాఠి.

మరింత సమాచారం తెలుసుకోండి: