త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.  ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్

 సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో తరికెక్కించనున్నారు.   బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను ఇప్పటికే హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఇటీవల గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రామ్ చరణ్సినిమా షూటింగ్లో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు డైరెక్టర్. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే బుచ్చిబాబు సినిమా చెయ్యొద్దు అని ఫిక్స్ అయ్యాడట చెర్రీ.

 ఈ క్రమంలోనే తాజాగా ఆర్ సి 16 సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే బుచ్చిబాబు సినిమా షూటింగ్లో రామ్ చరణ్ జూన్ నుండి పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ను అక్టోబర్ 10 విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ విషయం పైకి క్లారిటీ రాదు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ ను కనబరుస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: