టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి చాలామందికి తెలుసు. ఇక పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో కొంతకాలానికి విడాకులు తీసుకుని ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్న సమయంలో సమంత మయోసైటిస్  వ్యాధి భారిన పడింది. అలా సినిమాలకి బ్రేక్ ఇచ్చేసింది. మయో సైటి స్ బాగా ఎక్కువ అవ్వడంతో సినిమాలు ఆపేసి కేవలం ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక సమంత సినిమాలతో బిజీగా

 లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలేవి చెయ్యకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో తనకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని సైతం సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. అయితే తాజాగా ఈమె నటించిన సిటాడిల్ అని వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సమయంలోనే తన సొంత నిర్మాణ

 సంస్థలో మా ఇంటి బంగారం అనే ఒక సినిమా కూడా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఎంతో కాలం నుండి బయట ఎవరికి కనిపించిన సమంత తాజాగా ఒక ఆశ్రమంలో కనిపించింది. గతంలో ఒకసారి ఆశ్రమం కి వెళ్ళిన సమంత మళ్ళీ ఇప్పుడు అదే ఆశ్రమంలో కనిపించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది సమంత. అక్కడే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అక్కడ సామ్ మెడిటేషన్ చేస్తున్న పలు ఫొటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మనలో చాలామంది గురువు లేదా మెంటార్‌ కోసం వెతుకుతుంటారని, మన లైఫ్ కి వెలుగు చూపుతూ, సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొడం అనేది చాలా ప్రత్యేకమైన సందర్భమని ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. మనకు జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలని తెలిపింది. అందుకు కారణం కూడా నిత్య జీవితంలో జరిగే సంఘటనల వల్ల లభిస్తోంది తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: