ప్రస్తుతం తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం 6 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. అతడికి హత్య చేశాడానే కోణంలో విచారిస్తున్నారు.జూన్ 11 వ తేదీన మైసూరు లోని ఓ ఇంట్లో బెంగళూరు పోలీసులు అతడిని అరెస్టు చేయడం జరిగింది.అభిమాని హత్యోదంతం, అరెస్ట్ తర్వాత దర్శన్ సినిమాలపై నిషేధం విధించాలనే డిమాండ్ కూడా బలంగా వినిపించింది. తాజా కథనాల ప్రకారం.. దర్శన్ నటించిన సినిమాలని నిషేధించడానికి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) నిరాకరించింది. ఫిలింఛాంబర్ నటీనటుల సంఘం ప్రతినిథులు గురువారం నాడు సమావేశమై.. పోలీసులు తమ విచారణను ముగించే దాకా దర్శన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని తేల్చిచెప్పారు.ఇక KFCC ప్రెసిడెంట్ MN సురేష్ విలేకరులతో మాట్లాడుతూ, `అతడిని సినిమా పరిశ్రమ నుండి నిషేధించాలని మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతడు 2011లో కూడా వివాదంలో చిక్కుకున్నప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు అతని భార్య అతనిపై గృహ హింస కేసు పెట్టింది.పూర్తి విచారణ పూర్తయ్యే వరకు మేము వేచి ఉంటాము` అని వ్యాఖ్యానించారు. 


అయితే బాధితుడు రేణుకాస్వామి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నామని అన్నారు.ఈమధ్య రేణుకా స్వామి తల్లిదండ్రులు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడికి న్యాయం చేయాలని, చిత్ర పరిశ్రమలో దర్శన్‌పై నిషేధం విధించాలని గట్టిగా డిమాండ్ చేశారు. అతని తండ్రి మాట్లాడుతూ- `నా కొడుకు భార్య గర్భవతి. నేను రిటైర్ అయ్యాను. ఆమె తన జీవితాన్ని ఎలా నడిపించాలి?` అని ప్రశ్నించడం జరిగింది.అలాగే రేణుకా స్వామి తల్లి రత్నప్రభ కూడా దర్శన్ ని.. దొంగ నేరస్థుడు! అని ఆరోపించారు. భవిష్యత్తులో నా కొడుకులాగా ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉండేందుకు భగవంతుడు దర్శన జ్ఞానాన్ని ప్రసాదించాలి! అని ఆమె పార్థించారు.ఇక పోలీసు అధికారుల వివరాల ప్రకారం.. అభిమాని రేణుకా స్వామి... దర్శన్ దీర్ఘకాల భాగస్వామి, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. మృతుడు రేణుకా స్వామిని దర్శన్ మైసూరులోని ఓ పొలానికి రావాల్సిందిగా పిలిచారు. అక్కడ అతడు రేణుకా స్వామిని చిత్రహింసలకు గురిచేసి చంపి, మృతదేహాన్ని కామాక్షిపాళ్యలోని కాలువలో పడవేసాడు. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర ఇంకా మరో 11 మందిని కూడా అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: