టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన జోష్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా సమంత నటించింది. ఈ సినిమా సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు రావడం , ఆ సమయంలో వీరి ప్రేమ మరింత ముదరడంతో పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొంత కాలానికే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విరు విడిపోయారు.

ఇక విడిపోయిన తర్వాత నాగ చైతన్య సినిమా నటి అయినటువంటి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు. వారిద్దరూ కలిసి తిరుగుతున్నారు. వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అనేక వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నాగ చైతన్య కి సినీ నటి అయినటువంటి శోభిత ధూళిపాళ్ల కి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే విరు వివాహం చేసుకోబోతున్నారు. ఇకపోతే మొదటి సారి శోభిత , నాగ చైతన్య పై తనకు ఉన్న ప్రేమను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది.

ఇక ఒక కవిత్వం ద్వారా ఈమె చైతూ పై తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పుకొచ్చింది. నా తల్లి మీకు ఏమైనా అయ్యుండొచ్చు. ఆమె ఏమైనప్పటికి ... మా తండ్రి నీకు ఎలా బంధువు అయ్యాడు. మీరు మరియు నేను ఎప్పుడు ఎలా కలిసినా.. మన హృదయాల్లో మాత్రం ప్రేమ ఉంది. మన ఇద్దరి హృదయాలు ఎర్రటి భూమిలా మారి వర్షపు జల్లుల్లో తడచిపోతున్నాయి. విడిపోవడానికి మించి మనం ఇద్దరం కలసిపోయాం అంటూ శోభిత కవిత్వం లో పోస్ట్ చేసింది. అలాగే శోభిత నిశ్చితార్థం తర్వాత చైతూ తో రొమాంటిక్ గా ఉయ్యాలలో కూర్చొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వీరిద్దరికి సంబంధించిన ఈ బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: