అయితే చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపద్యంలో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. అయితే భారీ బడ్జెట్ తో ఈ మూవీ వివిధ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. దీంతో దేవర మూవీకి భారీగానే ఓపెనింగ్స్ ఉంటాయని అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు.
కానీ ఒక్క విషయం మాత్రం అటు తారక్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు అనే సందేహాలు తెరమీదకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భారీ వర్షాలు కారణంగా ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ వరదలు నేపథ్యంలో జనావాసాలు మొత్తం స్తంభించిపోయాయి. రోడ్లు బస్ స్టాప్లు రైల్వేస్టేషన్లో అన్ని జలమయమయ్యాయి. అయితే సెప్టెంబర్ 26 - 28 మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం తుఫాన్ వల్ల భారీ వర్షపాతం ఉందని అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర సిరిమను రిలీజ్ చేస్తే మీకు ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే మాత్రం అది చివరికి మూవీ ఓపెనింగ్ కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.