ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వింటూ వస్తున్నాం. మరి ముఖ్యంగా కొంతమంది స్టార్ట్స్ కూడా హీరోయిన్ పట్ల పరోక్షంగా నెగిటివ్గా స్పందిస్తూ వస్తున్నారు.  అయితే తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ సినిమా రైటర్ ప్రసన్నకుమార్ హీరోయిన్ శ్రీలీలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోల్లింగ్ కిఅయ్యేలా చేస్తుంది. మనకు తెలిసిందే మాస్ మహారాజా రవితేజ కెరియర్లో వన్ అఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ధమాకా .


సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకున్నింది. యావరేజ్ రివ్యూస్ తో మొదలైన ఈ సినిమా ఎవ్వరు ఊహించిన విధంగా 100 కోట్లు క్రాస్ చేసి అటు శ్రీలీలకి ఇటు రవితేజ కెరియర్ కు బాగా ప్లస్ గా మారింది. ఈ సినిమా ఇప్పటికి టీవీలో వచ్చిన జనాలు ఎగబడి చూసేస్తారు.  మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు వేరే లెవెల్ . సినిమా రిలీజ్ అయిన కొత్తలో సినిమా హిట్ అవ్వడానికి కారణం మొత్తం శ్రీలీలనే అని ఆమె గ్లామర్ ఆమె డాన్సులే ఈ సినిమా హిట్ అయ్యేలా చేశాయి అని 100 కోట్లు రావడానికి కారణం కూడా శ్రీలీల అందమే అంటూ మాట్లాడుకున్నారు .



శ్రీ లీల వల్ల ఈ సినిమా హిట్ అయింది అంటూ ప్రచారం చేశారు . ఇదే మాట సినిమా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ దగ్గర ప్రస్తావిస్తే మాత్రం ఆయన షాక్ అయిపోయాడు. " కేవలం హీరోయిన్ గ్లామర్ ..డాన్సులు వల్ల సినిమా ఆడేస్తుందా..? అంటూ ప్రశ్నించాడు . అంతేకాదు శ్రీ లీల ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో గ్లామర్ గా కనిపించింది .. డాన్సులు చేసింది.. అవన్నీ హిట్ అయ్యాయా ..?అంటూ ప్రశ్నించడం అందరికీ షాకింగ్ గా అనిపించింది . ఏ సినిమా అయినా బాగా ఆడింది అంటే అందుకు ప్రధాన కారణం కధ నే అని.. ఒక సినిమాలో పాటలు మహా అయితే 20 నిమిషాలు ఉంటాయి అని..  ఆ 20 నిమిషాలు ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ వస్తే సినిమా ఆడేస్తుందా ..?అంటూ తిరిగి ప్రశ్నించారు . మిగతా రెండు గంటల పాటు కథను ఆసక్తికరంగా నడిపిస్తేనే ఆ పాటల వల్ల సినిమా ఎంగేజ్ అవుతుంది అంటూ మాట్లాడారు". దీంతో శ్రీలీల తక్కువ చేసినట్లే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: