
కొన్నేళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట సడన్గా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. వివాహం అనంతరం నిరంతరం సోనాక్షి సిన్హా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంది. అయితే వీటన్నిటినీ కూడా పట్టించుకోకుండా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన లైఫ్ ను మాత్రం ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తోంది.తన భర్తతో కలిసి అప్పుడప్పుడు వెకేషన్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండే సోనాక్షి సిన్హా ఈ క్రమంలోనే తన భర్త జహీర్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోలను ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ మీరు విడాకులకు దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది అంటూ కామెంట్ చేయడంతో.. ఈ విషయం పైన సోనాక్షి సిన్హా అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. ముందు మీ అమ్మ, నాన్నను విడాకులు తీసుకోనీవ్వు ఆ తర్వాత మేము ఖచ్చితంగా తీసుకుంటాము అంటూ..టిప్ ఫర్ ట్యాగ్ అన్నట్లుగా ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. మొత్తానికి విడాకుల విషయం పేరు వినగానే సోనాక్షి సిన్హా కు చాలా కోపం వచ్చిందంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.