తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా మరియు నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించు కున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించాడు . అలాగే ఎన్నో మూవీలను కూడా నిర్మించా డు. ఇలా నటుడి గా , నిర్మాత గా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించ గా ... అలనాటి స్టార్ హీరోయిన్ అయినటువం టి విజయశాంతిమూవీ లో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది.

మూవీ తాజాగా ఏప్రిల్ 18 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మూవీ లో హీరో అయినటువంటి కళ్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. తాజా ఈవెంట్లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ... మా సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం నాకు అందుతున్న సమాచారం మేరకు మా మూవీ ఈ బుధవారం లేదా గురువారం వరకు బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. అది కన్ఫామ్. అంత గొప్ప విజయం అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr