ప్రభాస్ ..ఓ రెబల్ హీరో ..ఓ స్టార్ హీరో..ఓ ఆరు అడుగుల అందగాడు.  ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్న ఇప్పటికి స్టేజ్ పైకి వచ్చి స్పీచ్ ఇవ్వాలి అంటే గజగజ వణికి పోతాడు . అది ప్రభాస్ మంచితనమా..? లేకపోతే ప్రభాస్ కి మాట్లాడడం రాదా..? అనేది ఎప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతూనే ఉంటుంది.  ప్రభాస్ నటించిన సినిమాల కన్నా ప్రభాస్ పెళ్లి మేటర్ ఎంత హైలెట్ అవుతుందో అందరికీ తెలిసిందే.  కాగా ప్రభాస్ కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.


హీరో ప్రభాస్ కి వీడియో గేమ్స్ పిచ్చి ఎక్కువగా ఉండేదట . నిజానికి చిన్నతనం నుంచే వీడియో గేమ్స్ ఆడే పిచ్చి ఎక్కువగా ఉందట . అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కొంచెం గ్యాప్ తీసుకున్నారట . కానీ ప్రభాస్ కి మాత్రం స్పోర్ట్స్ అన్న వీడియో గేమ్ ఆడటం అన్న మహా మహా ఇష్టమట.  ఇప్పటికీ టైం దొరికితే మాత్రం ప్రభాస్ ముందుగా స్పోర్ట్స్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారట. సినిమా షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న వారానికి ఒక్కసారైన గేమ్‌స్ ఆడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తారట.



ఆ తర్వాత కచ్చితంగా టైం దొరికితే ఇంట్లో వీడియో గేమ్స్ సరదాగా తన ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో ఆడుతూ ఉంటారట.  హైలెట్ ఏంటంటే రానా దగ్గుబాటి  - ప్రభాస్ ఇద్దరు కూడా ఇలా వీడియో గేమ్స్ లో పోటీలు పెట్టుకొని మరీ ఆడుతూ ఉంటారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఏజ్ ఎంతో అందరికీ తెలుసు.  ఇంత ఏజ్ వచ్చినా ఇప్పటికీ ప్రభాస్ వీడియో గేమ్స్ ఆడుతాడా ..? చిన్నపిల్లాడిలా వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తాడా..? అని తెలుసుకొని ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. నిర్మలమైన మనసున్న వ్యక్తులు అందరూ ఇలానే ఉంటారు అని వయసుతో సంబంధం లేకుండా తమ మనసుకు నచ్చిన పని చేస్తూ ఉంటారు అని రెబెల్ ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారు ప్రభాస్ ని . ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: