టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ రోజున తన 38వ పుట్టినరోజు సందర్భంగా అందర్నీ సడన్ సర్ప్రైజ్ చేసింది. ఈ స్పెషల్ డే సందర్భంగా తన మొదటి సినిమా శుభం ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా డబుల్ ట్రీట్ ని ఇచ్చింది సమంత. త్రలల మూవీ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా సరికొత్త కథఅంశంతో శుభం ట్రైలర్ ని రూపుదిద్దింది సమంత.


హనుమాన్ హీరో తేజ సజ్జా ,డైరెక్టర్ నందిని రెడ్డి ఇప్పటికే శుభం ట్రైలర్ ని చూసి ప్రశంసించడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఫీల్ గుడ్ మూవీ అని బాగోద్వేగంతో అందరిని ఆకట్టుకుంటున్నది అంటూ తెలియజేశారు. సమంత నిర్మాతగా చాలా చక్కనైన సినిమాని ఎంపిక చేస్తుందని సినీ వర్గాల నుంచి సమంత పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ హడావుడిలో హీరో రానా కూడా రంగంలోకి దిగడం జరిగింది.శుభం ట్రైలర్ ని చూసి మరి షేర్ చేస్తూ గుడ్ లక్ ఫోక్స్ ఇది ఫన్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది రానా.


ఇక రానా మాటలకు సమంత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థాంక్యూ రానా అంటూ తన ఆనందాన్ని తెలియజేసింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి అటు రానా, సమంత మధ్య(బ్రదర్ ,సిస్టర్) మంచి స్నేహబంధం ఉన్నది. శుభం మే-9వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్ కి కూడా స్పందన భారీగా రావడంతో సినిమా పైన కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. సమంత ఒకవైపు నిర్మాతగానే కాకుండా మరొకవైపు నటిగా కూడా ఇందులోనే నటిస్తోంది. సమంత తన తదుపరి చిత్రాల అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: