టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అలాంటి హీరోయిన్ సమంత పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ సమంత కోసం కట్టిన గుడిలో తన అభిమాని ప్రత్యేక వేడుకలు నిర్వహించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో హీరోయిన్ సమంత పుట్టినరోజు వేడుకలను ఆమె అభిమాని సందీప్ చాలా గ్రాండ్గా నిర్వహించారు.

 సమంత చేసే సేవా కార్యక్రమాలు చూసి అభిమానం పెంచుకున్నారని ఈ సందర్భంగా ఆమెకు గుడి కట్టినట్లు వెల్లడించాడు. గతంలోనే గుడి కట్టగా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆమె నిండు నూరేళ్లు సుఖశాంతులతో... జీవించాలని ఈ సందర్భంగా సందీప్ కోరాడు. దీంతో సమంత గుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఇవాల్టితో 308 సంవత్సరాలు పూర్తి చేసుకుంది హీరోయిన్ సమంత.

 అడుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో 14 సంవత్సరాలుగా కొనసాగుతోంది ఈ బ్యూటీ.  అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ సమంత కాంబినేషన్లో ఏం మాయ చేసావే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సమంత అడుగు పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్య అలాగే సమంత ఇద్దరు లవ్ ఎఫైర్ పెట్టుకున్నారు.

 దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు సమంత అలాగే అక్కినేని నాగచైతన్య. అయితే ఈ వీళ్ళ కాపురం ఎన్నో రోజులు లేదు. 2021 డిసెంబర్ సమయంలో ఇద్దరు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య.... శోభితను పెళ్లి చేసుకున్నాడు. కానీ హీరోయిన్ సమంత మాత్రం ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. అనారోగ్యం బాగా లేకపోయినా సరే... ముందుకు వెళ్తోంది. ఎక్కడ తగ్గడం లేదు హీరోయిన్ సమంత. ఈ తరుణంలోనే తాజాగా బర్త్ డే కూడా చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: