టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకప్పటి నటులు ఎంతో సాంప్రదాయంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటించేవారు. అలాంటి వారిలో నటి నికిత ఒకరు. ఈమె 2002లో హాయ్ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2003లో వేణు హీరోగా నటించిన కళ్యాణ రాముడు సినిమాతో హీరోయిన్ గా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన సంబరం సినిమాలో నటించిన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏవండోయ్ శ్రీవారు, డాన్, మహారాజశ్రీ లాంటి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 

తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది. అయితే సినిమాల పరంగా తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ తో ప్రేమలో పడింది. ఇదివరకే దర్శన్ కు వివాహం జరిగింది. అయినప్పటికీ దర్శన్, నికిత సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగించారు. వీరిద్దరి ప్రేమ విషయం దర్శన్ భార్య విజయలక్ష్మికి తెలిసిపోవడంతో ఆమె నికితకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ నికితలో ఎలాంటి మార్పు లేకపోవడంతో విజయలక్ష్మి పోలీస్ స్టేషన్ లో నికితపై కంప్లైంట్ ఇచ్చింది. దర్శన్ పై గృహహింస కేసును కూడా నమోదు చేసింది.

దీంతో దర్శన్ కొన్ని రోజులపాటు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దీంతో నికితపై కన్నడ సినీ ఇండస్ట్రీ దాదాపు మూడేళ్ల పాటు నిషేధం విధించారు. ఆ తర్వాత తమిళంలో నికితకు ఎలాంటి సినిమా అవకాశాలని ఇవ్వలేదు. ఇక నికిత 2017లో ప్రముఖ వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. ఎంతో అందం, నటన ఉన్నప్పటికీ సుఖం మోజులో పడి తన కెరీర్ ను పూర్తిగా నాశనం చేసుకుంది. పెళ్లయిన స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ కారణంగానే నిఖిత కెరీర్ నాశనమైందని సినీ పరిశ్రమలో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు నికిత తన వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా కొనసాగిస్తున్నారు. తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: