తమిళ నటుడు సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా సూర్య ప్రకటించాడు. ఇకపోతే సూర్య , వెంకీ అట్లూరి కాంబోలో సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సూర్య హీరో గా వెంకీ అట్లూరి ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ కథను రూపొందించబోతున్నట్లు , ఈ సినిమా కథ ఓ డాన్ చుట్టూ తిరగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా వెంకీ అట్లూరి మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాను సూర్య పై రూపొందించబోతున్నాడు అని వార్తలు రావడం తోనే ఒక్క సారిగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే సూర్య ఆఖరుగా కంగువా అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. కాంగువా లాంటి భారీ ఫ్లాప్ తర్వాత సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రెట్రో అనే సినిమాలో హీరో గా నటించాడు. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే వెంకీ అట్లూరి ఆఖరుగా దుల్కర్ సల్మాన్ హీరో గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా లక్కీ భాస్కర్ అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక వెంకీ , సూర్య కాంబోలో రూపొందబోయే మూవీ పై తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: