సమంత అన్న పేరు కనపడితే చాలు కచ్చితంగా జనాలు ఓ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు . సమంత అంటే అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . అయితే ఈ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. పెళ్లి అయిన తర్వాత విడాకులకు ముందు సమంత పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో అందరికీ తెలుసు.  ఎక్కడ చూసినా సమంత..  ఏ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ అయినా సమంత .. ఆమె పేరు లేనిదే అసలు సమంత ఫ్యాన్స్ కి పూట గడవదు అన్నంత రేంజ్ లో సమంత అభిమానులు ఆమె పేరుని  ట్రెండ్ చేస్తూ వచ్చారు.


సీన్ కట్ చేస్తే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్స్ తో వల్గర్ మాటలతో ఆమె పేరు ట్రోల్ అయినంత విధంగా మరి ఏ హీరోయిన్ పేరు కూడా ట్రోలింగ్ కి గురి కాలేకపోయింది . అంతలా సమంత పై నెగిటివిటీ క్రియేట్ చేసుకుంది . ఇవన్నీ పక్కన పెడితే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలా చాలా బలంగా నమ్మేస్తున్నారు సమంత అభిమానులు . రాజ్ నిడమూరు తో సమంత గత కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తుంది అని త్వరలోనే వీళ్ల రెండో పెళ్లి అఫీషియల్ ప్రకటన బయటకు రాబోతుంది అని అంతా అనుకున్నారు.



ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు . కానీ అది కుదరలేదు.  అంతేనా అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో సమంత లీడ్ పాత్రలో కనిపించబోతుందని ఆమె పుట్టిన రోజు సందర్భంగా దీని పై అఫిషీయ్ల్ ప్రకటన బయటకు వస్తుంది అని ఫ్యాన్స్ అనుకున్నారు. అది కూడా జరగలేదు . అంతేకాదు అప్పుడెప్పుడో ఓ సినిమా ప్రకటించింది సమంత . సొంత బ్యానర్ లోనే మూవీ ప్రకడించడంతో జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. "మా ఇంటి బంగారం" అనే టైటిల్ కూడా పెట్టేసుకుంది. అయితే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికైనా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇస్తుందేమో అని ఆశలు పెట్టుకున్నారు . అది కూడా కుదరలేదు.  అసలు సమంత పుట్టినరోజు ఈసారి చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసేసుకుంది. ఆమెకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఏది ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయారు. సమంత ఈ మూడు కోరికలను ఎప్పుడో నెరవేరుస్తుందో అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్..!??

మరింత సమాచారం తెలుసుకోండి: