ఎన్టీఆర్ ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ హీరో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వెలువడింది. డ్రాగన్ సినిమాను 2026 జూన్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బర్త్ డే మే 20న జరగనుంది. ఇక తారక్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా సినిమా షూటింగ్ లో పాల్గొనలేక పోతున్నారు.

ఇక ఈ నెల 22న డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. డ్రాగన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా ముగ్గురిని సెలెక్ట్ చేశారట. రుక్మిణి వసంత్, శృతి హాసన్, మమతా బైజు లను హీరోయిన్లుగా అనుకుంటున్నారట. ఇందులో రుక్మిణి వసంత్, శృతి హాసన్ లను మెయిన్ హీరోయిన్లుగా తీసుకోబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: