మోనాలిసా ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోనాలిసా పేరే గత కొద్దిరోజుల నుంచి వైరల్ అవుతుంది. ఈమె మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటుండగా మోనాలిసాను చాలామంది ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆమెతో సెల్ఫీలు సైతం తీసుకున్నారు. దీంతో మోనాలిసా వైరల్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో మోనాలిసా విపరీతంగా వైరల్ గా మారడంతో ఈమెకు సినిమాలలో, సీరియల్స్ లలో అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. 


బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో అవకాశాలను అందుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక మోనాలిసా పలు టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొని డబ్బులను సంపాదిస్తోంది. మోనాలిసా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ మరింత పాపులారిటీని తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే మోనాలిసాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.


ఆ ఫోటోలలో మోనాలిసా మేకప్ వేసుకొని చాలా సాంప్రదాయంగా ముస్తాబు అయింది. అందులో మోనాలిసా మేకప్ వేసుకొని రెడీ అవ్వడంతో హీరోయిన్ కి మించిన అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అందంతోపాటు మోనాలిసా యాక్టింగ్, డాన్స్ కూడా నేర్చుకున్నట్లయితే సినిమా అవకాశాలు వరుసగా వస్తాయని సినీ వర్గాల్లో కొంతమంది దర్శక నిర్మాతలు చెబుతున్నారట. ఈ క్రమంలోనే మోనాలిసా యాక్టింగ్ స్కూల్లో కూడా చేరినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక మోనాలిసా వరసగా సినిమాలలో అవకాశాలను అందుకుని సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారిపోతుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఇంత గొప్ప స్థాయికి మోనాలిసా ఎదిగిపోవడంతో తన కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోనాలిసా ఏదైనా సినిమాలలో నటించడానికి ఇలా మేకప్ వేసుకొని రెడీ అయిందా లేకపోతే కేవలం ఫోటోల కోసం మాత్రమే ఇలా రెడీ అయిందా అనే సందేహంలో కొంతమంది ఉన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: