టీమిండియా క్రికెటర్ చాహల్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. చాహల్ తన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక చాహల్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతను ధనశ్రీ వర్మ అనే నటిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2020 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. ఇక మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. వివాహం జరిగిన రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య అనేక రకాల గొడవల కారణంగా 2025లో విడాకులు తీసుకున్నారు.



ధనశ్రీ వర్మ భరణం కింద చాహల్ నుంచి దాదాపు 4 కో ట్ల రూపాయలకు పైనే పొందింది. ఇక విడా కుల అనంతరం ధనశ్రీ వర్మ చాలా సంతోషంగా తన లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇక ఈమె బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరో యిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ధనశ్రీ వర్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. దీంతో ధనశ్రీ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు.


టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ధనశ్రీ వర్మ నటించబోతుందట. ధనశ్రీ ని హీరోయిన్ గా పెట్టి దిల్ రాజు సినిమాను తీయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది. ధనశ్రీ సరసన హీరోను ఎంపిక చేసే పనిలో నిర్మాత ఉన్నారట.

రీసెంట్ గానే సంక్రాంతి వస్తున్నాను సినిమాతో మంచి విజయాన్ని అందుకని లాభాల బాటలో దూసుకుపోతున్నారు దిల్ రాజు. ఆ సినిమా అనంతరం అనేక సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించి టాలీవుడ్ లోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: