కోలీవుడ్ నటుడు సూర్య,పూజ హెగ్డే కాంబినేషన్లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన్న తాజా మూవీ రెట్రో..  ఈ సినిమా సూర్య తన సొంత 2D ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఈ సినిమా మే1 న విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే చిత్ర యూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్లో ఈ సినిమాకి మంచి బజ్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఈ సినిమాకి అంతగా బజ్ లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా రిలీజ్ కి మరి కొద్ది గంటలే ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు. అయితే దీనికి కారణం నిర్మాత నాగవంశీ అని తెలుస్తోంది. 

ఎందుకంటే గత కొద్దిరోజుల నుండి నిర్మాత నాగ వంశీ సినీ ఇండస్ట్రీలోని ఫిలిం జర్నలిస్టులపై నిప్పులు చెరుగుతున్నారు. తన సినిమా గురించి ఏదైనా చెడ్డ వార్త రాస్తే చాలు వారిపై నిప్పులు కురుస్తున్నారు. ముఖ్యంగా ఓ సినిమా ఈవెంట్లో నా సినిమా గురించి ఎవరు ప్రమోట్ చేయనక్కర్లేదు. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు. మీకు దమ్ముంటే నా సినిమాకి సంబంధించిన రివ్యూలు, ఆర్టికల్స్ రాయడం మానేయండి. నా సినిమాను నేనే ప్రమోట్ చేసుకుంటా.. అంటూ నిర్మాత నాగ వంశీ తెలుగు ఫిలిం జర్నలిస్టులు హర్ట్ అయ్యేలాగా ఎన్నో మాటలు మాట్లాడారు.

 అయితే నాగ వంశీ మాట్లాడిన మాటల పట్ల హర్ట్ అయిపోయిన ఫిలిం జర్నలిస్టులు నాగ వంశీ నిర్మాతగా చేసే ఏ సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి రివ్యూస్, ఆర్టికల్స్ రాయకూడదు అని నిర్ణయించుకున్నారని,అందుకే రెట్రో మూవీ గురించి తెలుగులో ఎక్కువగా రాయడం లేదని తెలుస్తోంది.అలా కోలీవుడ్ లో ఎంతో బజ్ ఉన్న రెట్రో మూవీకి టాలీవుడ్ లో బజ్ లేకపోవడానికి కారణం నిర్మాత నాగ వంశీ నేనని, నిర్మాత నాగావంశీ ఆలోచించకుండా చేసిన కామెంట్ల కారణంగా ఆయన నిర్మించే ప్రతి ఒక్క సినిమా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: