మహేష్ బాబు ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 సినిమా 2027 లో రిలీజ్ చేయనున్నారు. 

ఈ సినిమాను ఆమెజాన్ అడవుల నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. పూర్తిస్థాయి అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా....ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో చిత్రీకరిస్తున్న ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్టుగా సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ప్రస్తుతం శంకరపల్లి శివార్లలో సినిమా షూటింగ్ జరుగుతోంది. షూట్ కోసం వేసిన సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య ఓ పాటను రాజమౌళి చిత్రీకరిస్తున్నారట. ఈ పాట షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుంది.

ఈరోజు నుంచి దాదాపు నెల రోజులపాటు మహేష్ బాబు వేసవి సెలవులను తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో సమయాన్ని చాలా ఎక్కువగా గడుపుతారు. సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే వెకేషన్ కి వెళుతూ ఉంటారు. అయితే రాజమౌళితో సినిమా అంటే దాదాపు నాలుగైదు సంవత్సరాల వరకు ఎక్కడికి వెళ్లకుండా షూటింగ్లోనే పాల్గొంటూ ఉంటారు. కానీ మహేష్ బాబుకి రాజమౌళి నెల రోజులపాటు సెలవులు ఇచ్చారట. దీంతో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక నెల రోజుల తర్వాత యధావిధిగా సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: