
గత ఏడాది షారుఖ్ ఖాన్ వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోశారు.. పఠాన్, డుంకి, జవాన్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సాధించి తన స్టామినా ఏంటో చూపించారు షారుక్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్లో ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అయితే ఇందులో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని దీపికా మరొకసారి షారుక్ ఖాన్ నటించిన బోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీపికా, షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఐదు చిత్రాలు విడుదలయ్యాయి.. అందులో హ్యాపీ న్యూ ఇయర్ , ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, జవాన్, పఠాన్ అంటే చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇందులో కూడా దీపిక హీరోయిన్గా కాకుండా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తెలియజేశారట. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షారుక్, దీపిక బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారని అభిమానులు తెలియజేస్తున్నారు. మరి ఆరో సారు కూడా ఆడియన్స్ అని ఎక్సైటింగ్ అయ్యేలా చేస్తారో లేదో చూడాలి మరి.