నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కే జీ ఎఫ్ సిరీస్ మూవీల ద్వారా మంచి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్న నటీమణి శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... ఇప్పటికే చాలా సినిమాలకు దర్శకత్వం వహించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ఈ మూవీ ని ఈ రోజు అనగా మే 1 వ తేదీన విడుదల చేయనుండగా ... ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న రాత్రి నుండే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా మంచి టాక్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలు సాధించడం , ఇక నాని వరుసగా దసరా , హాయ్ నాన్న , సరిపోదా శనివారం లాంటి వరుస విజయాల తర్వాత నటించిన సినిమా కావడం , అలాగే హిట్ ది థర్డ్ కేస్ మూవీ నుండి ఇ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి ఫ్రీ సేల్స్ ద్వారానే అద్భుతమైన కలెక్షన్స్ దక్కాయి. ఇకపోతే బుక్ మై షో ఆప్ లో ఈ సినిమా సంబంధించిన ప్రీ సేల్స్ అద్భుతమైన రీతిలో జరిగాయి. బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ సేల్స్ 335 కే జరిగాయి. ఇలా బుక్ మై షో లో టికెట్ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: