సమంత ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఏ మాయ చేసావే సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న సమంతసినిమా అనంతరం వెను తిరిగి చూడకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది. సమంత చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాల పైనే అవుతుంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా తన సినిమాలతో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో సమంత ముందు వరుసలో ఉంది. ఇక సమంత ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.

తెలుగుతోపాటు హిందీలోనూ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా.... సమంత వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సమంతకు సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అక్కినేని నాగచైతన్య, సమంత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. విడాకుల తర్వాత సమంత ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

వరుసగా సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుకుంటుంది. సమంత విడాకుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తోంది. ఇక సమంత సినిమాల పరంగా ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందట. హీరో నాని తరహాలో ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయాలని సమంత నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసి సమంత అభిమానులు సంతోష పడుతున్నారు. కాగా సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుండగా అవి వైరల్ అవుతాయి. సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: