
ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్నాయి. హిట్ అయ్యే సినిమాల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు .. కానీ చాలా సినిమాలకు సూపర్ హిట్ అంటూ పోస్టర్లు కూడా వేసుకుంటున్నారు. మరికొన్ని సినిమాలుకు బ్రేక్ ఈవెన్ అయినట్టు గొప్పలు పోతున్నారు.. అలాంటిదేం లేదని లెక్కలతో సహా బయట పెడితే మాత్రం చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లంతా తాజాగా దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ వింటే టాలీవుడ్ ఎంత డిజాస్టర్ పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. ఏప్రిల్ నెలలో జరిగిన సినిమా రాలేదని స్వయంగా దిల్ రాజు ఒప్పుకున్న పరిస్థితి. ఏప్రిల్ అంతా ఒకటే టెన్షన్ సినిమాలు వస్తున్నాయి .. కానీ జనాలు థియేటర్లకు రావట్లేదు .. సమ్మర్ అంతా అయిపోతుందని అనుకున్నారు. ఏప్రిల్ లో సరైన సినిమాలు లేక జనాలు థియేటర్లకు రాక ఏపీ తో పాటు నైజంలో కొన్ని స్క్రీన్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి ఉందని స్వయంగా దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ... డిస్ట్రిబ్యూటర్ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది.
తమ సినిమా ఆడలేదని చెబుతుంటే కొంతమంది అంగీకరించలేకపోతున్నారు.. ఓ వైపు సరైన హిట్లు లేక ఇండస్ట్రీ కుదేలు అవుతుంటే చాలామంది నిర్మాతలు ఇగోలకు పోయి .. ఆడని సినిమా కూడా సూపర్ హిట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పోనీ ప్రారంభంలో ప్రచారం కోసం ప్రేక్షకులను ఆకర్షించడం కోసం అన్ని కోట్ల వచ్చాయి .. ఇన్ని కోట్లు వచ్చాయి అని పోస్టర్లు వేసుకుంటున్నారు అనుకున్నా తర్వాత అంగీకరించకపోతే టాలీవుడ్ మరిన్ని థియేటర్లు మూతపడటం ... ఇండస్ట్రీ మరింత ఇబ్బందుల్లో పడటం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు