నటుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అవన్నీ ఎవరే స్టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా ఈ హీరో నటించిన తండెల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గా నిలిచింది. ఇక నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా తండేల్ చిత్రం నిలిచింది. ఈ సినిమాకు ముందే అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. చాలా కాలం పాటు సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. అంతకుముందే నాగచైతన్యకు నటి సమంతతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అతి తక్కువ సమయంలోనే మనస్పర్ధల కారణంగా విడిపోయారు. 

విడాకుల అనంతరం నాగచైతన్య అతి తక్కువ సమయంలోనే శోభితతో ప్రేమలో పడ్డాడు. ఇక శోభితను వివాహం చేసుకున్న తర్వాత నాగచైతన్యకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వివాహం తర్వాత నాగచైతన్య నుంచి వచ్చిన చిత్రం తండేల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా అనంతరం నాగచైతన్య మరో సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.... వివాహం జరిగినప్పటి నుంచి శోభితపై అనేక రకాల ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. శోభిత వాటిని ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. వివాహం అయిన తర్వాత నాగచైతన్య, శోభిత ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

 ఇద్దరు కలిసి సమయం దొరికినప్పుడల్లా బయటికి వెళ్లడం ఎంజాయ్ చేయడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే శోభిత, నాగచైతన్య ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్ కు వెళ్లారు. అక్కడ నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. శోభిత కూడా చాలా సాంప్రదాయంగా చీరకట్టు, బొట్టులో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా వీరిద్దరి జంట చూడ చక్కగా ఉందని అభిమానులు కామెంట్లు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరిపై మరోసారి ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు సోషల్ మీడియాలోని నెటిజన్లు. శోభిత, నాగచైతన్య చేతిని పట్టుకొని నడుస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే శోభిత నాగచైతన్యను తన వెంట కుక్కలా తిప్పుకుంటుంది అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై శోభిత, నాగచైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: