ఒక సినిమా సెలబ్రిటీకి ఎంత అయితే గుర్తింపు ఉంటుందో అదే స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఫోక్ డాన్సర్స్,సింగర్స్ కూడా..చాలా మంది ఫోక్ డాన్సర్స్, ఫోక్ సింగర్స్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వెండితెరపై కూడా రాణిస్తున్నారు.ఇక అలా ఫేమస్ అయిన వారిలో ఫోక్ డ్యాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానూ లిరీ కూడా మరో ఫోక్ డాన్సర్ ని పెళ్లి చేసుకొని ఒక బాబుని జన్మనిచ్చాక విభేదాల కారణంగా విడాకులు తీసుకొని బాబును తీసుకొని వేరుగా ఉంటున్న జాను ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు జాను అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయినా జాను లిరీ ఢీ షోలోకి కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ జాను డాన్సులు మెచ్చుకోవడంతో శేఖర్ మాస్టర్ కి జాను లిరీ కి మధ్య ఏదో జరుగుతుంది అనే రూమర్లు కూడా వినిపించాయి. ఇక రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. జాను లిరికి నాతో ఎఫైర్ ఉంది అంటూ వార్తలు రాసేస్తున్నారు.

 ఒక అమ్మాయి బాగా డాన్స్ చేసింది కాబట్టి ఆమెని ఎంకరేజ్ చేసాను. అంతే కానీ ఆమెతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. మా ఇద్దరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ మాటల కారణంగా రెండు ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి. ఇప్పటికైనా ఈ వార్తలు రాయడం ఆపేయండి అంటూ శేఖర్ మాస్టర్ వార్నింగ్ ఇచ్చారు.ఈ విషయం పక్కన పెడితే తాజాగా జానూ లిరీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు,పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజానికి జాను లిరీ రెండో పెళ్లి చేసుకోలేదు. కొంతమంది యూట్యూబ్లో థంబ్ నెయిల్స్ సృష్టించి మరీ జాను రెండో పెళ్లి చేసుకుంది అంటూ ఫోటోలు,వీడియోలు వ్యూస్ కోసం క్రియేట్ చేస్తున్నారు.అయితే ఈ పోస్టులు చూసిన జాను కోపంతో ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను రెండో పెళ్లి చేసుకున్నట్టు కొంతమంది కొన్ని ఫోటోలు పోస్టులు చేస్తున్నారు.

 అలాగే జాను లిరీ వ్యక్తిత్వం అలాంటిది ఇలాంటిది అంటూ రూమర్లు ప్రచారం చేస్తున్నారు. నేను ఎలాంటి దానినైతే మీకెందుకు.. మా అమ్మ నాన్న ఇప్పటివరకు నన్ను ఒక్క మాట కూడా అనకుండా గారాబంగా పెంచారు.అలాంటిది మీలాంటి అడ్డమైన వారితో నేను మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తుంది.ఒక ఆడదాన్ని ఇంతలా వేధించడం మంచిది కాదు. నేను ఎవరితో కనిపించినా కూడా వారితో సంబంధాలు అంటగట్టేస్తున్నారు. నా పక్కన తమ్ముడు లాంటి వాడు అన్నలాంటి వాడు ఉన్నా కూడా వారితో లింకులు పెట్టేస్తున్నారు. అయినా నా పర్సనల్ లైఫ్ గురించి మీకు అనవసరం. ఒకరిని ఇబ్బంది పెట్టి నవ్వుకోవాలనుకోవడం ఎప్పటికీ మంచిది కాదు.నా రెండో పెళ్లి గురించి మీకు అనవసరం అంటూ చాలా కోపంగా జాను లిరీ ఏడ్చుకుంటూ మరీ ఓ వీడియో పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: