నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది చలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ సినిమా అనంతరం వరుసగా తెలుగులో సినిమా అవకాశాలను పొందింది. ఈ చిన్నదానితో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క హీరో ఎంతో ఆసక్తిని చూపించారు. ఇక రష్మిక తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరు సరసన హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ లోనూ ఈ చిన్నది అనేక సినిమాలలో నటించింది. 

హిందీలో కూడా నటించి అక్కడ అభిమానుల మనసులను దోచుకున్న ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా రష్మిక ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ చిన్నది పుష్ప సినిమాతో ఎనలేని గుర్తింపును పొందింది. ఇక తెలుగు, హిందీలో ఉన్న అనేక మంది హీరోయిన్లలో రష్మిక ముందు వరుసలో ఉండడం విశేషం. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి.

ఈ క్రమంలోనే నటి రష్మిక సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసుకుంది. అందులో తాను చేతికి పసుపు తాడు కట్టుకొని నుదుటిపై పెళ్లి బొట్టు పెట్టుకుంది. దీంతో రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకుందని సోషల్ మీడియా వేదికగా ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. తన ముఖంలో కూడా పెళ్లికళ ఉందని చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే రష్మిక ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: