చూస్తుంటే మెగా ఫ్యామిలీలో మళ్ళీ కొత్త వార్ స్టార్ట్ అయిన్నట్టుంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ - అల్లు ఫాన్స్ మధ్య ఎలాంటి వార్ జరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. పరోక్షంగా వరల్డ్ వార్ 3 రేంజ్ లోనే వీళ్ళ మధ్య ట్విట్టర్ వేదికగా వార్  జరిగింది . అయితే ఇప్పుడిప్పుడే ఆ వార్ కి ముగింపు పలికే విధంగా మెగా ఫ్యామిలీ అదే విధంగా అల్లు ఫ్యామిలీ ప్రవర్తిస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే రామ్ చరణ్ కి ఇష్టం లేని పని చేస్తున్నాడు వరుణ్ తేజ్ అన్న వార్త మెగా ఫాన్స్ కి గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తుంది.


రామ్ చరణ్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో అందరికీ రామ్ చరణ్ అంటే చాలా చాలా ఇష్టం . అందరి పట్ల నిజాయితీగా ఉంటాడు అని అందరిని ఒకే విధంగా ట్రీట్ చేస్తారు అని చాలామంది మెగా హీరోస్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ - వరుణ్ తేజ్ కి ఒక సలహా ఇచ్చిన ఆ సలహాను పాటించడం లేదు అన్న వార్త బయటకు వచ్చింది . రామ్ చరణ్ - బోయపాటి దర్శకత్వంలో "వినయ విధేయ రామ" సినిమా వచ్చింది . ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.



అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్  బోయపాటి పై ఫుల్ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  అదే మూమెంట్లో రామ్ చరణ్ కి చెప్పిన కథ ఒకటి ..తెరకెక్కించిన విధానం ఒకటి.. బోయపాటిని అసలు నమ్మకూడదు అంటూ మెగా ఫ్యామిలీ మెగా హీరోలకు స్ట్రిక్ట్ గా ఈ విషయాన్ని చెప్పేసిందట . అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్షన్లో ప్లాన్ చేస్తున్నాడు అన్న వార్త బయటకు వచ్చింది . ప్రజెంట్ అఖండ2 సినిమాతో బిజీగా ఉన్నాడు బోయపాటి శ్రీను .



అయితే ఈ సినిమా అయిపోగానే వరుణ్ తేజ్ తో ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించబోతున్నారట . వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు మాస్ హీరోగా తనదైన స్టైల్ లో మెప్పించడానికి ట్రై చేస్తున్నాడు.  ఈ క్రమంలోనే హిట్ లేక అల్లాడుతున్న వరుణ్ ఈ సినిమాకు కమిట్ అయ్యాడట . అయితే ముందు జాగ్రత్తగా రాంచరణ్ ఈ సినిమాని కమిట్ అవ్వద్దు అంటూ హెచ్చరించారట . అయినా సరే వరుణ్ తేజ్ మాట వినలేదట . ఫస్ట్ టైం రామ్ చరణ్ మాట వినకుండా వరుణ్ తేజ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమాకి సైన్ కూడా చేసేసాడట. దీని పట్ల రామ్ చరణ్ గుర్రుగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో మెగా బ్రదర్స్ మధ్య మాటలు కట్ అయినట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: