టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి హీరోయిన్లు ఎంతో అందంగా, సాంప్రదాయంగా ముస్తాబు అయ్యేవారు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకునేవారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా అభిమానులను ఆకట్టుకునేవారు. అలాంటి వారిలో నటి రాశి ఒకరు. నటి రాశి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూడ చక్కగా పక్కింటి అమ్మాయి వలే కనిపించే రాశి కుందనపు బొమ్మలా ఉంటుంది. రాశి తన కెరీరలో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. 

ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. రాశి తల్లి, అత్త వంటి పాత్రలను మాత్రమే పోషిస్తుంది. అంతే కాకుండా సీరియల్స్ లోను నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాశి ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని అనేక రకాల వార్తలను వైరల్ చేశారు. అతను మరెవరో కాదు హీరో రాజేంద్రప్రసాద్. వీరిద్దరూ కలిసి శ్రీరామచంద్రులు, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా వరుసగా అనేక సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే వీరి మధ్య ఉన్న స్నేహాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు.

 ఇండస్ట్రీలోని పెద్దలు కూడా వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని అనేక రకాల వార్తలను ప్రచారం చేశారు. ఇండస్ట్రీలో రాశిపై అనేక రకాల వార్తలు రావడంతో తన క్యారెక్టర్ మంచిది కాదంటూ ఆమెకు సినిమాలలో అవకాశాలు రాకుండా చేశారు. దాంతో రాశి విసిగిపోయి తన కెరీర్ కు చెడ్డ పేరు వస్తుందని భావించి సినిమాలకు వీడ్కోలు పలికింది. అనంతరం తక్కువ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ నీ వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక చాలాకాలం తర్వాత రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రాజేంద్రప్రసాద్, రాశి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఇంకేమీ లేదని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆ తర్వాత రాశికి సినిమా అవకాశాలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. ప్రస్తుతం రాశికి సంబంధించిన ఈ వార్త చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: