నేటి కాలంలో చాలామంది యూట్యూబర్లుగా వారి లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నారు. యూట్యూబర్లుగా వృత్తిని ఎంచుకొని లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, ఫుడ్, ఫ్యాషన్, ఫిట్నెస్, స్టడీస్ ఇలా రకరకాలుగా వీడియోలు చేసి పెడుతున్నారు. అందులో ముఖ్యంగా ట్రావెలింగ్ వీడియోలు హైలైట్ గా నిలుస్తాయి. చాలామంది వ్యక్తులు యూట్యూబర్లుగా వృత్తిని ఎంచుకొని మంచి గుర్తింపును సాధిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఒకరు. ప్రపంచ యాత్రకుడిగా అన్వేష్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. చాలా కాలం నుంచి యూట్యూబర్ గా మారిన అన్వేష్ భారీగా డబ్బులను సంపాదించాడు. ఈ మధ్యకాలంలో అన్వేష్ చాలామంది యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నాడు. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వారికి సంబంధించిన ఆధారాలను సేకరించి వాటితో వీడియోలు చేసి తన యూట్యూబ్లో షేర్ చేస్తున్నాడు. దీంతో వారి లైఫ్ అక్కడితో ముగిసిపోతోంది. చాలామంది యూట్యూబర్లను అన్వేష్ ఇలానే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ప్రపంచయాత్రికుడు అన్వేష్ పై ఘాటు వాక్యాలు చేశాడు. అన్వేష్ జనాలను మభ్యపెట్టి తన వైపు తిప్పుకుంటున్నాడని సన్నీ అంటున్నారు. అన్వేష్ ను దరిద్రుడిగా అభివర్ణిస్తున్నాడు. ఇలాంటి వీడియోలు చేస్తూ అన్వేష్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలను సంపాదించాడని ఘాటు వాక్యాలు చేశారు. జనాలందరూ అన్వేష్ మాయలో ఎలా పడిపోతున్నారో అర్థం కావడం లేదని అంటున్నాడు.

ఈ క్రమంలోనే ప్రపంచ యాప్ ఎప్పుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసును నమోదు చేశారు. తెలంగాణ డిజిపి జితేందర్, మెట్రో యం.డి ఎన్విఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి వికాస్ రాజు, దాన కిషోర్ తదితరులపై అన్వేష్ ఆరోపణలు చేశాడు. హైదరాబాదులోని మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం పేరుతో దాదాపు 300 కోట్ల రూపాయలు కొట్టేసారంటూ ఓ వీడియో ద్వారా అన్వేష్ ప్రచారం చేశాడని పోలీసులు అతనిపై కేసును నమోదు చేశారు. దీంతో అన్వేష్ ను పోలీసులు ఏ సమయంలోనైనా వారి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్వేష్ ను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొంతమంది చెబుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: