నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన హిట్ 3 సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సోష‌ల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూలే క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గ‌ర‌గ త్రినాథ‌రావు హిట్ 3 సినిమాపై త‌న సమీక్ష‌లో సినిమా ఎలా ఉంది ? ప్ల‌స్‌లు ఏంటి ? మైన‌స్‌లు ఏంట‌న్న దానిపై స‌మీక్షించారు. మ‌రి ఆయ‌న త‌న స‌మీక్ష‌లో ఏం రాసుకువ‌చ్చారో చూద్దాం.


నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో పాటు హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం.. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా వేరే లెవల్‌లో ఉండటంతో హిట్ 3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూసారు. దాంతో ఇటీవ‌ల కాలంలో ఏ సినిమాకి రానంత క్రేజ్ ఈ సినిమాకు వచ్చింది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగానే హిట్ 3 తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. అర్జున్ సర్కార్‌గా క్రూయల్ కాప్  పాత్రలో న్యాచురల్ స్టార్ అదరగొట్టాడు. హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించింది.డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు.దర్శకుడు ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది.అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తను రాసుకున్న స్క్రీన్ ప్లే లో ఎక్కడా కూడా డౌటు రాకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. శైలేష్ గత చిత్రం సైంధవ్ తాలూకు పరాజయపు ఛాయలు కనపడకుండా  ఏమాత్రం తగ్గకుండా ఆయన రైటింగ్ లోని మెచ్యూరిటీని ఈ సినిమాలో చాలా బాగా చూపిస్తూ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో సఫలం అయ్యాడని చెప్పాలి.


ఇక ఎమోషనల్ సీన్స్ ని డీల్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో నాని వయోలెన్స్ అంటే ఏంటో చూపించాడు..ఇక హీరో హీరోయిన్లు నాని-శ్రీనిధిల మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ బాగా పండాయి. హిట్ 2 హీరో అడవి శేష్ ఎంట్రీ సర్ ప్రైజ్‌గా అనిపిస్తుంది కానీ.. కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్లైమాక్స్‌లో వచ్చి విలన్ల ఏరివేత కార్యక్రమంలో భాగమంతే. ఇక హిట్ సీక్వెన్స్‌లో నాలుగో కేసు ఉండబోతుందని ఏసీపీ వీరప్పన్‌గా కార్తిని చూపించారు. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే రావు రమేష్, సముద్రఖని, కోమలి ప్రసాద్, చైతు జొన్నలగడ్డతదితరులు వారి పాత్రల పరిధి మేర నటించారు.సాంకేతిక నిపుణుల పనితనం చాలా బాగుంది.


షాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని సీన్స్ ను ఎలివేట్ చేశాయి. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ట్రై చేశాడనిపించింది.దర్శకుడు శైలేష్‌ కొలను కథను మరింత బలంగా రాసుకుని, సినిమాలో హింస, రక్తపాతాన్ని తగ్గిస్తే నాని సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకునేది. స్టైలిష్ మేకింగ్ ఉన్నా కూడా థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి లేకపోవడం లోటుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మరో ప్రధానమైన మైనస్ బలమైన విలన్ లేకపోవడం. వెండితెరపై మితిమీరిన హింస, భయంకరమైన రక్తపాతాలకు  యూత్ కనెక్ట్ అవుతున్నారనేది బాలీవుడ్లో కిల్.. మలయాళంలో మార్క్ నిరూపించాయి. అలా చూసుకుంటే తెలుగులో హిట్ 3 థర్డ్ కేస్ వాటి సరసన ఖచ్చితంగా చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: