పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో పొందిన జల్సా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో ఇలియానా , పార్వతి మెల్టన్ , కమలిని ముఖర్జీ హీరోయిన్లు గా నటించ గా ... ప్రకాష్ రాజ్ , సునీల్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు . గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించ గా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాను సంగీతం అందించాడు . ఈ మూవీ 2008 వ సంవత్స రం ఏప్రిల్ 2 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయింది.

మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే రు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మే 16 వ తేదీన రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలకు రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి. మరి పవన్ నటించిన జల్సా మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కలెక్షన్లు దక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: