
కానీ అట్లీలో వేరే లెవెల్ టాలెంట్ కూడా ఉంది అంటూ బయట పెట్టబోతున్నాడు ఈ కోలీవుడ్ డైరెక్టర్. మనందరికీ తెలిసిందే పుష్పలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను కంప్లీట్ చేయబోతున్నాడట . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ ని పిలవబోతున్నారట . అందుకు సంబంధించిన అన్ని పనులను కూడా పూర్తి చేసేసారట డైరెక్టర్ అట్లీ.
అంతేకాదు ఈ సినిమా కోసం ప్రభాస్ వాయిస్ ఓవర్ కూడా తీసుకోబోతున్నట్లు ఓ న్యూస్ తెర పైకి వచ్చింది . అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టైంలో ప్రభాస్ వాయిస్ ను ఇవ్వాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట అట్లీ . కానీ ఇంకా ప్రభాస్ దానికి ఓకే చేయలేదు అంటూనే తెలుస్తుంది . కానీ పూజ కార్యక్రమాలకు మాత్రం చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ ఓకే చేశారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇద్దరు బడా స్టార్స్ ని ఓకే ఈవెంట్లో చూస్తే ఫ్యాన్స్ ఇక రచ్చరంబోలానే చేస్తారు అంటున్నారు జనాలు. చూడాలి మరి ఏం జరుగుతుందో..???